తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా క్రిష్టియన్ సానుబూతి పరుడు పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్ని హిందు సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు పట్టించుకోకుండా చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.
నేడు విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ నేతలు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రాజ్‌భవన్ వద్ద, పరిసరాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. కాగా… రాజ్‌భవన్ ముట్టడికి వీహెచ్‌పీ కార్యకర్తలు పెద్దఎత్తున వస్తుండగా ఐమాక్స్ వద్ద విద్యా గణేశానందస్వామితో పాటు వీహెచ్‌పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పలువురు వీహెచ్‌పీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేయడమేగాక సుధాకర్‌యాదవ్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.
